![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -398 లో.....అమూల్య, విశ్వకి కాఫీలో ఏదో కలిపి ఇస్తుంది. అది తాగి విశ్వ వాష్ రూమ్ కి పరుగెడతాడు. నీరసంగా అయిపోయి.. ఒసేయ్ కాఫీలో ఏం కలిపావే అని విశ్వ అడుగుతాడు. అయ్యో నేనేం కలిపాను అండి అని ఏం తెలియనట్లు అమూల్య అడుగుతుంది. విశ్వ చెప్పింది ఎవరు వినరు. మరొకవైపు నర్మద కోసం సాగర్ వెయిట్ చేస్తాడు. అప్పుడే నర్మద తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తుంది. ఏంటి సాగర్ నర్మదతో మూవీకి వెళ్తావా అని అడుగుతారు. ఏం లేదని సాగర్ సిగ్గుపడతాడు.
ఇప్పుడు సాగర్ రైస్ మిల్ లో పని చెయ్యడం లేదు రీసెంట్ గా సాగర్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నర్మద చెప్తుంది. అవునా కంగ్రాట్స్ అని వాళ్ళు చెప్తారు. ఏం ఎగ్జామ్ రాసావ్.. ఎప్పుడు రాసావని ప్రశ్నలు వేస్తుంటే సాగర్ టెన్షన్ పడుతాడు. అక్కడ నుండి నర్మదని తీసుకొని బయల్దేరతాడు. సాగర్ టెన్షన్ పడుతుంటే నర్మదకి డౌట్ వస్తుంది. మరొకవైపు అసలు సాగర్ దగ్గర అతను ఎందుకు డబ్బు తీసుకున్నాడని భాగ్యం వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడే వనజ కోపంగా రామరాజు దగ్గరికి వస్తుంది. మీకు ఇరవై లక్షలు ఇచ్చాను కదా మళ్ళీ వాటిని తిరిగి ఇవ్వాలి కదా అని అడుగుతుంది. అయ్యో మా అబ్బాయికి ఇవ్వమని చెప్పానని రామరాజు అంటాడు. ఒకసారి వాడికి ఫోన్ చేస్తానని రామరాజు అంటాడు. అవసరం లేదు మావయ్య సాగర్ వచ్చాడని శ్రీవల్లి చెప్తుంది.
ఒరేయ్ వాళ్ళ డబ్బు ఇవ్వలేదా అని రామరాజు కోప్పడతాడు. లేదు నాన్న మర్చిపోయానని సాగర్ అంటాడు. ఇప్పుడే వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకొని వాళ్లకు ఇవ్వమని రామరాజు అనగానే వాళ్ళు తీసుకొని రాలేరు.. ఎందుకంటే బ్యాంకు టైమ్ అయిపోయిందని శ్రీవల్లి అంటుంది. సరే రేపు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వమని రామరాజు చెప్తాడు. దానికి సాగర్ టెన్షన్ పడుతూ సరే అంటాడు. మా ఇంటికి డబ్బు తీసుకొని వచ్చి ఇవ్వాలని వనజ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. సాగర్ టెన్షన్ పడుతుంటే నర్మదకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత వేదవతి డల్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్ వస్తారు. ఏమైందని అడుగుతారు. చందు వచ్చి అలానే అడుగుతాడు. సాగర్ ని పిలుస్తుంది వేదవతి. ముగ్గురు కొడుకులతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |